RBI-Gold | ఇంగ్లండ్ నుంచి 100 టన్నుల బంగారం తరలించిన ఆర్బీఐ.. ఎందుకంటే..?!
RBI-Gold | ఇంగ్లండ్ నుంచి ఆర్బీఐ సుమారు 100 టన్నుల అంటే లక్ష కిలోల బంగారాన్ని స్వదేశానికి తరలించింది.
RBI-Gold | ఇంగ్లండ్ నుంచి ఆర్బీఐ సుమారు 100 టన్నుల అంటే లక్ష కిలోల బంగారాన్ని స్వదేశానికి తరలించింది. 1991 తర్వాత భారీ మొత్తంలో బంగారం తరలించడం ఇదే మొదటిసారి. 1991లో ఆర్థిక సంక్షోభం వల్ల భారత్ భారీగా బంగారం నిల్వలు తాకట్టు పెట్టింది. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే ఆర్బీఐ భారీగా బంగారాన్ని తీసుకొచ్చింది.
కొన్నేండ్లుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నది. అలా కొనుగోలు చేసిన బంగారం ఎక్కడ నిల్వ చేయాలన్న విషయమై సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నది ఆర్బీఐ. ముంబైలోని మింట్ రోడ్డుతోపాటు నాగ్‌పూర్‌లోని తన పాత కార్యాలయంలో బంగారం నిల్వ చేస్తుంది. విదేశాల్లో బంగారం నిల్వలు గణనీయంగా పెరగడంతో కొంత మొత్తం స్వదేశానికి తరలించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఆర్బీఐతోపాటు పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు తమ బంగారాన్ని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్‌లో నిల్వ చేస్తుంటాయి. గత మార్చి నెలాఖరు నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంటే, అందులో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది. ఇటీవల వరుసగా బంగారం కొనుగోళ్లు జరిపిన ఆర్బీఐ.. గతేడాది 27.5 టన్నుల పుత్తడిని కొత్త నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు పెంచిన సెంట్రల్ బ్యాంక్.. గత జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో 2023 లో కొన్న బంగారానికంటే ఒకటిన్నర రెట్లు కొనుగోలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

