Nalgonda | నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎస్పీ సూచించారు.
శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని అన్నారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై
చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.