హుజురాబాద్ : మేము సామాన్యరైతులం, వ్యవసాయం చేసుకునే రైతు కూలీలం. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, అన్ని రకాల ఫించన్లను రెండువందల నుంచి 2వేల పదహారు చేసింది. ఉచిత విద్యుత్, నీళ్లు కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. కులాల వారిగా ఎన్నో పథకాలు కల్పిస్తున్నారు. ఎస్సీలకు దళితబంధు, గొల్లకుర్మల కు గొర్రెలు పంపిణీ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.
ఇలాంటి గవర్నమెంట్‌ను మేము మరచిపోం. బీజేపీ ప్రభుత్వం మాకు చేసిందేం లేదు. బండి సంజయ్ మాకు ఎంపీగా ఉండి చేసిందేం లేదు. ఈటల రాజేందర్ కూడా ఏరోజు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న విద్యుత్‌ను కూడా తీసేసి మీటర్లు పెట్టే ఆలోచనలో బీజేపీ ఉంది. అటువంటి బీజేపీకి ఓటేలా వేస్తం. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకి సహకరించం. మా గ్రామాల్లో మీరు తిరగాల్సిన అవసరం కూడా లేదు.
– సుధాకర్‌రావు, ఉప్పల్, కమలాపూర్ మండలం
బీజేపీకి ఎవరూ ఓటు వేయరు
ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఈటల రాజేందర్‌గారు మొన్నటిదాక టీఆర్ఎస్లో ఉండి మా గవర్నమెంట్ మాకంటే మంచిగా పని చేసిన ప్రభుత్వం ఏది లేదని చెప్పి, మొన్నటికి మొన్న ఆయనేదో వ్యక్తిగత కారణాలతో బీజేపీలకు పోయి చేసేది చెప్తలేడు. చేసింది చెప్తలేడు.
ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా బీజేపీవాళ్లు చేయలేదంటున్నరంటే బీజేపీకి ఎవరూ ఓటు వేయరు. ఎవరూ అందులోకి పోరు. మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఇంకా ముందు ముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ మే వస్తది. కాబట్టి అందరూ టీఆర్ఎస్కే ఓటు వేస్తరు. మేము కూడా చెప్తున్నం. అందరు కూడా మద్ధతు ఇస్తున్నారు.
–ఎర్రబెల్లి రవీందర్ రావు, రైతు, ఉప్పల్ గ్రామం
బీజేపీకి ఓటేందుకు వేయాలని జనం అడుగుతున్నరు
ఈరోజు హుజురాబాద్‌లో బీజేపీ చేసిందేం లేదు. బండిసంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నర సంవత్సరాలు ఐన ఒక్కరూపాయి పనిచేసింది లేదు. ఏడు సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌గారు ఒక్కరోడ్డు వేయించలేదు. ఆయన విద్యానగర్ లో ఉండే ఇంటి నుంచి కూడా సైదాపూర్ కు రోడ్డు వేయించలేదు. ఇన్ని వర్క్‌లు పెండింగ్ పెట్టి ఈ రోజు బీజేపీలో ఆత్మగౌరవం అని తిరుగుతాండు.
అసలేం లేదు బీజేపీలో. మీరు చేసిందేం లేదు హుజూరాబాద్‌లో. మీరే చెప్పాలి ఏం చేశారో. మీరు సెంట్రల్ గవర్న మెంట్‌గా ఉండి ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ గాని ఏమన్న తెస్తామని మాట్లాడుతలేరు. అసలు మీకు ఓటు ఎందుకు వేయాలని జనం అడుగుతున్నారు. ఇంకా రెండున్నర సంవత్సరాల్లో ఏం చేయలేరు. ఆత్మగౌరవం లేదు ఏం లేదు. అంతా గెల్లు శ్రీనువైపే ఉన్నరు. టీఆర్ఎస్ పార్టీనే హుజూరాబాద్‌లో గెలుస్తది.
– దుబాసి బాబు, ఇందిరానగర్, హుజురాబాద్