న్యూఢిల్లీ : పెండ్లికి ముందే సెక్స్ చేయడం లేదా సహజీవనం చేయడం శిక్షించదగిన నేరంగా పేర్కొంటున్న చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును 2022 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. మూడేండ్ల తర్వాత శుక్రవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ మూడేండ్లలో ఈ చట్టం గురించి ప్రజలకు, పోలీసులకు శిక్షణ ఇచ్చారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని, సెక్స్ చేస్తే, దోషులకు ఒక ఏడాది జైలు శిక్ష విధించవచ్చునని ఈ చట్టం చెప్తున్నది. పెండ్లి కాకుండానే సహజీవనం లేదా కలిసి జీవించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చునని పేర్కొన్నది.