కుభీర్, జనవరి 02 : నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఎంపీడీవో సాగర్ రెడ్డి (Sagar Reddy) సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు పరిచయ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ జీపీలకు ప్రభుత్వం అందించే నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో కోరారు.
తాగునీరు, ఆరోగ్యంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పాటుపడి గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దాలని పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సర్పంచ్లకు ఎంపీడీఓ సూచించారు. గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ, ఆత్మ ఛైర్మన్లు గోనె కల్యాణ్, సిద్ధంవార్ వివేకానంద్, మండల ప్రత్యేకధికారి శంకర్, ఎంఈఓ విజయ్ కుమార్, ఎంపీఓ భీమేష్, నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.