Gutta Sukhender Reddy : అబద్ధపు హామీలు, ప్రజాపాలన పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసన మండలిలోనూ చీవాట్లు తప్పలేదు. శీతాకాల సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు షాకిచ్చారు.
రోడ్డు, భవనాలు, రవాణా రవాణ శాఖల అలసత్వం కారణంగానే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అన్నారు. రోడ్ల మీద గుంతలు ఉండటం, రహదారులపై ఆర్టీసీ బస్సులను అడ్డంగా ఆపడం వంటి చర్యల వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రి పొన్నంకు గుత్తా సుఖేందర్ రెడ్డి చురకలు అంటించారు.
మంత్రి పొన్నంకు శాసనమండలి చైర్మన్ చురకలు
R&B, రవాణ శాఖల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి
రోడ్ల మీద గుంతలు ఉండటం, రహదారులపై ఆర్టీసీ బస్సులు అడ్డంగా ఆపడం లాంటి చర్యల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి pic.twitter.com/wwzzL45Cas
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026