అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh) కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. ముఖ్యంలో శాంతి భద్రతలు (Law and order) పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కనీన సౌకర్యాలను కల్పించడం, ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక చేతులెత్తుస్తుందని విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కూటమి పాలనలో రూ.లక్షా 40 వేలకోట్ల అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఒరగబెట్టిదేమి లేదని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. వైసీపీ హయాంలో పాలనను ప్రజల వద్దకు చేర్చామని పేర్కొన్నారు. ఇంటివద్దకే ఫించన్లు, రేషన్ సరుకులు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్ నేరుగా వచ్చేవని అన్నారు.