‘ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన మా బావగారు రామ్చరణ్కు థాంక్స్. ఆయన వల్ల ఈ సినిమా చాలా మందికి రీచ్ అవుతున్నది’ అని చెప్పింది కథానాయిక లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో దేవ్మోహన్తో కలిసి నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకుడు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు.
వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని, చిత్రీకరణ సమయంలో తనకు ప్రెగ్నెన్సీ అని తెలిసినా టీమ్ మొత్తం మద్దతుగా నిలిచారని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా అస్వాదించే సినిమా ఇదని, ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తాతినేని సత్య అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని దేవ్ మోహన్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాత: నాగమోహన్, దర్శకత్వం: తాతినేని సత్య.