Heinrich Klaasen | నా కుటుంబాన్ని వీడియో తీస్తే దెబ్బలు తింటావ్.. అభిమానికి క్లాసెన్ హెచ్చరిక..!
Heinrich Klaasen : ఐపీఎల్ -19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకమవుతున్న హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)కు చిర్రెత్తుకొచ్చింది. తన అనుమతి లేకుండా కుటుంబం ఫొటోలు, వీడియో తీస్తున్న అభిమానిపై క్లాసెన్ మండిపడ్డాడు.
Heinrich Klaasen : ఐపీఎల్ -19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకమవుతున్న హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)కు చిర్రెత్తుకొచ్చింది. తన అనుమతి లేకుండా కుటుంబం ఫొటోలు, వీడియో తీస్తున్న అభిమానిపై క్లాసెన్ మండిపడ్డాడు. నా ఫ్యామిలీని వీడియో తీయడం ఆపకుంటే దెబ్బలు తింటావు.. జాగ్రత్త అని ఈ చిచ్చరపిడుగు హెచ్చరించాడు. క్లాసెన్ వార్నింగ్‌తో వణికిపోయిన అభిమాని అంత దాకా ఎందుకులే అనుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
సన్‌రైజర్స్ ట్రంప్ కార్డ్‌లా అవతరించిన హెన్రిచ్ క్లాసెన్ ఎప్పుడు చూసినా ప్రశాంతంగా కనిపిస్తాడు. తన పనేదో తనది అన్నట్టుగా ఉండే అతడికి ఒక అభిమాని తీరుతో కోపం నశాలానికి చేరుకుంది. అసలేం జరిగిందంటే.. క్లాసెన్ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక అభిమాని అతడిని, అతడి భార్యాబిడ్డలను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. తన అనుమతి లేకుండా వీడియో తీయడం క్లాసెన్‌ను నచ్చలేదు.
One guy was recording Klaasen despite him saying no then he went to him and said
“Don’t do it, If I turn around and see you clicking me and my family, I promise you’ll be on the floor next moment”
Why can’t they give them privacy at least when they’re with family🤷🏼♂️ pic.twitter.com/WL8oid0xqv
— Neil🔪 (@PsychDominant) April 30, 2026
‘నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీడియో రికార్డు చేయకు. నేను వద్దని చెప్పానుగా ఇక్కడ నుంచి వెళ్లు. నీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ, ఫొటో, వీడియో మాత్రం తీయకు’ అని క్లాసెన్ సదరు అభిమానికి చెప్పాడు. అయినప్పటికీ అతడు కెమెరా వీరివైపు తిప్పి ఫొటోలు, వీడియో తీయడం చూసి కోపంతో ఊగిపోయాడీ డాషింగ్ బ్యాటర్. ‘నేను అనుమతిస్తేను నువ్వు మా కుటుంబం ఫోటో తీయాలి. లేదంటే దెబ్బలు తింటావ్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని క్లాసెన్ గట్టిగానే హెచ్చరించాడు. దాంతో దూరంగా వెళ్తూ కూడా ఆ వ్యక్తి కెమెరాను క్లాసెన్ కుటుంబం వైపు గురి పెట్టాడు.
Look at the bowler’s reaction 😳
Look at the Cummins laugh 😅
Look at the MI dugout’s reaction 👀Everyone was left stunned after watching Heinrich Klaasen’s switch hit into the second tier. 💀⚡
Pure ABD vibes with Warner-level consistency. 📈🔥 pic.twitter.com/kH2NTrfJoV
— AdityaVarma (@AdityaVarma45_) April 29, 2026
తడి తీరుతో మరింత చికాకు తెచ్చుకున్న సఫారీ ఆటగాడు ‘ఇది నా కుటుంబం. నేను అనుమతిస్తేను ఫొటో తీయాలి. నీ కెమెరాను దూరంగా పెట్టుకో’ అని క్లాసెన్ తీవ్ర స్వరంతో అన్నాడు. క్రికెటర్లపై అభిమానం ఉండడం సరే. కానీ, వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పలువురు క్లాసెన్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. పంతొమ్మిదో సీజన్లో క్లాసెన్ బ్యాటుతో చెలరేగిపోతున్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో ఈ హిట్టర్ 157.41 స్ట్రయిక్ రేటుతో 441 పరుగులు చేశాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

