Bullet-proof Jacket | నేను అందుకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించను : డొనాల్డ్ ట్రంప్
Bullet-proof Jacket | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ (Bullet Proof Jacket) ధరించకపోవడానికి కారణాన్ని వెల్లడించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bullet-proof Jacket : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ (Bullet Proof Jacket) ధరించకపోవడానికి కారణాన్ని వెల్లడించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ట్రంప్‌పై పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు.
తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం ఉండదని ట్రంప్ అన్నారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. హత్యాయత్నం నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమే అన్నారు. ఈ విషయం తనను చాలామంది అడిగారని, ఈ విషయం ఆలోచించవలసిందే వ్యాఖ్యానించారు. కానీ తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం ఉండదని చెప్పారు. అలా చేస్తే మనం ఒక చెడుశక్తికి లొంగిపోయినట్లు అవుతుందని అన్నారు.
ఇదిలావుంటే.. మీపై మరోసారి దాడి జరుగుతుందేమోనన్న ఆందోళన మీకు ఉందా..? అని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అలాంటి వాటి గురించి తాను ఆలోచించనని చెప్పారు. అలాంటి వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే తాను తన పనిని సక్రమంగా చేసుకోలేనని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

