న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఆనాటి సీఎంలకు నెహ్రూ ఓ లేఖ రాశారు. ఆ లేఖకు చెందిన తర్జుమాను వినిపిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఉద్యోగాల్లో ఎటువంటి రిజర్వేషన్లను తాను ఇష్టపడడం లేదని నెహ్రూ పేర్కొన్నట్లు గుర్తు చేశారు. అసమర్థతకు, ప్రమాణాల స్థాయి పడిపోయే అవకాశం ఉండే రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. పుట్టుక నుంచి నెహ్రూ కుటుంబం రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. ఒకవేళ అప్పట్లోనే ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసి ఎప్పటికప్పటి ప్రమోషన్లు ఇస్తే, ఇప్పుడు వాళ్ల స్థాయిలో ఎక్కడో ఉండేదని మోదీ అన్నారు.
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi reads out a letter by the then PM late Jawaharlal Nehru to the then Chief Ministers.
He says, “….I am reading out its translation – “I dislike any kind of reservation, more particularly in services. I am strongly against… pic.twitter.com/MeulkyxRLP
— ANI (@ANI) February 7, 2024