యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజా పర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు.
అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు.
పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను యాదాద్రి అర్చక బృందం నిర్వహించగా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.