టేకులపల్లి, మే 05 : టేకులపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం బేతంపూడి (పీఏసీఎస్) చైర్మన్ గా లక్కినేని సురేందర్ రావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ అనుబంధం అసిస్టెంట్ రిజిస్టార్ కె.ఆదినారాయణ చేతుల మీదుగా సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం లక్కినేని సురేందర్ రావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు బోడ బాలు నాయక్, బానోత్ రామా నాయక్, జాలాది అప్పారావు, చీమల సత్యనారాయణ, గుగులోతు లక్ష్మ, లకావత్ నాకా, పూల్ సింగ్, ఆంగోత్ లక్పతి, గూగులోత్ కృష్ణ, బానోతు లాలు, ఉండేటి బసవయ్య, బానోతు రవి, రవీందర్, టేకులపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, బేతంపూడి పీఏసీఎస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

బేతంపూడి సొసైటీ చైర్మన్గా లక్కినేని సురేందర్ రావు