– గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్
చండూరు, మే 05 : ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థల యందు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కోటి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తమ జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామన్నారు. అలాగే తమ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్స్ పులిపాటి రాధిక, చిలుకూరి రామేశ్వరి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి పాల్గొన్నారు.

‘నిరుపేదల శ్రేయస్సే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం’