CM Thalapathy Vijay | దళపతి కాదు ‘సీఎం’ విజయ్.. ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌పై ఫ్యాన్స్ రిక్వెస్ట్!
Thalapathy Vijay | తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
CM Thalapathy Vijay | తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan) టైటిల్ కార్డ్ విషయంలో అభిమానులు ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో సాధించిన అద్భుత విజయాన్ని పురస్కరించుకుని, ‘జననాయగన్’ సినిమా ప్రారంభంలో వేసే టైటిల్ కార్డును మార్చాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను కోరుతున్నారు. సాధారణంగా విజయ్ సినిమాల్లో ‘దళపతి విజయ్’ అని టైటిల్ కార్డ్ పడుతుంది. అయితే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీనిని ‘సీఎం దళపతి విజయ్’ (CM Thalapathy Vijay) అని మార్చాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం సిబిఎఫ్ సి (CBFC) రివైజింగ్ కమిటీ వద్ద ఉంది. మరోవైపు ఇటీవలే ఈ సినిమా ఆన్లైన్లో లీక్ కావడం పెద్ద దుమారం రేపింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే సినిమాను అడ్డుకుంటున్నారని విజయ్ అప్పట్లో ఆరోపించారు. అయితే విజయ్ సీఎం అవుతుండడంతో ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రాబోతుందని.. సెన్సార్ పూర్తయిన వెంటనే మే చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాకు ముందు వచ్చే టైటిల్ కార్డుపై దళపతి కాకుండా సీఎం విజయ్ అని పెడితే బాగుంటుందని చిత్రయూనిట్‌ని అభిమానులు కోరుతున్నారు. ఇక ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ని చిత్రబృందం ఏ మేరకు నేరవేరుస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

