Bhanu Chander | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80, 90వ దశకాల్లో యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన భానుచందర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా, తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కోనసీమలోని అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్, “గోదావరి రుచులు” అధినేత చిట్టిబాబుకు భానుచందర్ వీరాభిమాని. చిట్టిబాబు వంటకాల రుచికి ఫిదా అయిన సెలబ్రిటీలలో భానుచందర్ కూడా ఒకరు. ఈ సందర్భంగా చిట్టిబాబు పెళ్లిరోజు వేడుకల సందర్భంగా భానుచందర్ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ వీడియోలో ఆయన కనిపించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఈ వీడియోలో భానుచందర్ పూర్తిగా తెల్లబడిన జుట్టు, గడ్డంతో ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్‌లో కనిపించారు. ఒకప్పుడు తెరపై కనిపించిన గ్లామరస్ లుక్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆయనలో భారీ మార్పు కనిపించడంతో, కొందరు నెటిజన్లు “ఇతను భానుచందరా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 ఏళ్లు కావడంతో సహజంగానే వచ్చిన ఈ మార్పు అభిమానులను షాక్‌కు గురిచేసింది. మేకప్ లేకుండా చాలా సాధారణంగా కనిపించడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. అయితే రూపం మారినా ఆయనలోని గంభీరమైన స్వరం, కళ్లలోని పవర్ మాత్రం అలాగే ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
భానుచందర్ ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన, తన యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. నిరీక్షణ, సితార వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన చిరస్థాయిగా నిలిచింది. ముఖ్యంగా సూత్రధారులు వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత సింహాద్రి, దుబాయ్ శీను వంటి చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, పలు సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలతో మెప్పించారు. ఇప్పటికీ ఆయన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
View this post on Instagram
A post shared by Godavari Ruchulu Chittibabu (@godavari_ruchulu_chittibabu)