యాదాద్రి భువనగిరి : పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా ఈ నెల 25వ తేదిన భువనగిరిలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షోను(KCR road show) జయప్రదం చేయాలని భువనగిరి (Bhuvanagiri) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మంగళ వారం జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
అనంతరం కేసీఆర్ రోడ్డు షో ఏర్పాట్లను జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.