హనుమకొండ, అక్టోబర్ 22 : ఆదివాసీల అస్తిత్వ పోరాటయోధుడు కుమ్రం భీమ్ అని కాకతీయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ప్రాంగణంలో కుమ్రం భీమ్ 124వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కుమ్రం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూకుమ్రం భీమ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్నారు.
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు అన్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఆయన పేరిట ఒక జాతీయ సదస్సు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ కుమ్రం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడినయోధుడు, ఆదివాసీల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభమని కొనియాడారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ, పాలక మండలి సభ్యులు బి.సురేష్‌లాల్, బి.రమ, సుదర్శన్, చిర్రా రాజు, సుకుమారి, ఎం.నవీన్. వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు.