హనుమకొండ చౌరస్తా, జులై 9: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 7, 8, 9 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల ‘ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్’ శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ఎన్.కిరణ్ కుమార్, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి చెందిన జూనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన పి.బాలాజీ, ఖమ్మం విశ్వవిద్యాలయ పీజీ కాలేజీకి చెందిన జే.వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ శిక్షణలో నోటింగ్, డ్రాఫ్టింగ్, ఎంఎస్ వర్డ్ బేసిక్స్, ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన పొందారు. మూడురోజుల శిక్షణాకాలంలో రోజువారి కార్యాలయ వ్యవహారాల్లో ప్రావీణ్యం, పనితీరులో మెరుగుదల వంటి అంశాలు నేర్చుకున్నారు. ఈ శిక్షణలో పాల్గొన్నవారిని, విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.