KTR | ఆదిలాబాద్ సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని.. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే జాప్యానికి కారణమన్న కేటీఆర్ సీసీఐ పునరుద్ధరణపై రేవంత్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతిపాదనలను ప్రస్తావించారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్ధి లోపం వల్లే జాప్యం జరిగిందని.. సీసీఐపై ఆరు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ..
రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/3akAYrqlmK— BRS Party (@BRSparty) July 22, 2026
కేంద్రమంత్రిని కలిసిన కేటీఆర్, సీసీఐ సాధన సమితి..
ఇటీవలే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీసీఐ సాధన సమితి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసిందని తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు సీసీఐ సాధాన సమితి సభ్యులను అందరినీ తీసుకొని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని కలిశాం. 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని అన్నారు. రాబోయే 100 సంవత్సరాల వరకు మీకు మైన్ స్టోన్ రిజర్వ్‌లు కూడా మీకు ఉన్నాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్‌ను నడిపేందుకు అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయన్నారు.
గతంలో 2019లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మాటిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్‌ను తప్పకుండా తెరిపిస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ప్లాంట్‌ను తెరిపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం కూడా మాటిచ్చారు. కానీ ఈ రోజు ఆదిలాబాద్ సీసీఐని తుక్కు కింద అమ్మేస్తున్నరని వారికి వివరంగా చెప్పడం జరిగిందన్నారు.