Pawan Kalyan | టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ సోదరి మెహర్ జ్యోతి సుంకర కన్నుమూసిందని తెలిసిందే. గత 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో చికిత్స పొందుతున్న ఆమె విజయవాడలో మంగవాళం రాత్రి 9:45 గంటలకు తుదిశ్వాస విడిచింది. మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఆమె మృతి పట్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కాగా జ్యోతి సుంకర మరణవార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే హైదరాబాద్‌లోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. మెహర్ రమేశ్‌ను కలిసి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. మెహర్ రమేశ్ కుటుంబసభ్యులను ఓదార్చిన పవన్‌కల్యాణ్.. జ్యోతి సుంకర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.
FLASH #NEWS మణిపాల్ హాస్పిటల్ లో
డైరెక్టర్ మెహర్ రమేష్ సిస్టర్ పార్థవదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 🙏🙏#PawanKalyan #JanaSenaParty pic.twitter.com/Sl1sFpvonW— K.JAGADEESH JSP (@KJagadeesh_JSP) July 22, 2026