హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆదివారం నల్గొండ జిల్లా మంథని నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ( Kannepalli Pump House ) ను సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి మంథని బయలుదేరి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆయనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లా సీనియర్ నేతలు పంప్ హౌస్‌ను పరిశీలించనున్నారు. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతారని వివరించారు.