KTR | సిరిసిల్ల టౌన్, మే 29: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబానికి ఆయన భరోసా కల్పించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కాసర్ల పద్మ 2020లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో 27వ కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పటికీ ఆమె ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. పది రోజుల కిందట కాసర్ల పద్మ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు.
పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పాలకవర్గం, పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. కాగా, ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.