ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ… కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని అన్నారు.
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు భరోసాను ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టారు. ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు ఎదురెక్కుతున్న వీడియోను షేర్ చేశారు.
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ… కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది!
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు… pic.twitter.com/F2EfbHELUV
— KTR (@KTRBRS) August 4, 2026