KTR | ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్, మీ అసాసినేషన్ ఏజెన్సీ హైడ్రా.. మీరు నియంతలను ఆరాధిస్తూ గొప్పలు చెప్పుకుంటారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు ముందే తెలుసు. ఇప్పుడు దేశం మొత్తానికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు‘ అని సెటైర్లు వేశారు.
మేం మీ అంత తెలివైన వాళ్లం కాదు.. అందుకే మా పాలనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం, మహాత్మాగాంధీ ఆశయాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలను ఆదర్శంగా తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. నియంతృత్వ ఆలోచనలకు తాము వ్యతిరేకమని, ప్రజాస్వామ్య విలువలే తమకు మార్గదర్శకాలని ఆయన వ్యాఖ్యానించారు.
బెంగళూరులో జాతీయ దినపత్రిక ది హిందూ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తనను తాను తాను హిట్లర్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విఫలయత్నం చేసిన రేవంత్ రెడ్డి చివరకు జాతీయ మీడియా ఎదుట బొక్కబోర్లాపడ్డారు. హెచ్చులకు పోయి నెటిజన్ల చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్‌కు గురవుతూ నవ్వులపాలయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలో హైడ్రా ఏర్పాటుపై యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేవంత్.. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో తాను హైడ్రాను తీసుకొచ్చినట్టు చెప్పారు. ‘హైడ్రా అనేది హిట్లర్ ఫేవరేట్ పదం. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. హిట్లర్‌కు ఉన్న కోర్ టీమ్ పేరు హైడ్రా. ఆ టీమ్ ఎవరినైనా అంతం చేయగలదు. కాబట్టి, నేను హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టాం’ అంటూ రేవంత్ నవ్వులు చిందించారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలనే ఉద్దేశంతోనే ఈ నియంతృత్వ కోణాన్ని సీఎం ప్రస్తావించినప్పటికీ, ఆయన చెప్పిన హిస్టరీ పూర్తిగా తప్పని తేలిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
హిట్లర్ కోర్ టీమ్ పేరు హైడ్రా అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మేధావులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండి, కనీస చరిత్ర తెలియకుండా హాలీవుడ్ కల్పిత కథలను నిజమని నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు చరిత్రలో హిట్లర్‌కు ‘హైడ్రా’ అనే కోర్ టీమ్ లేదు. అది ఆయనకు ఇష్టమైన పదమూ కాదు. ‘మార్వెల్ కామిక్స్’, ‘కెప్టెన్ అమెరికా’ సినిమాల్లో సృష్టించిన ఒక కల్పిత ఉగ్రవాద విలన్ ఆర్గనైజేషన్ పేరు ‘హైడ్రా’. ఆ ఫిక్షనల్ స్టోరీలో దీనిని నాజీలకు అనుసంధానించి చూపించారు. ఆ సినిమా కథను నిజమైన చరిత్ర అనుకొని సీఎం రేవంత్‌రెడ్డి భ్రమపడ్డారంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. గ్రీకు పురాణాల ప్రకారం.. హైడ్రా అనేది చెడుకు సంకేతం. రాక్షసుల పెంపుడు జంతువు పేరు ‘హైడ్రా’. దానికి పలు తలలు ఉంటాయి. ఒక్క తలను నరికేస్తే, రెట్టింపు తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ‘ఎంతకీ పరిష్కారం కాని సమస్య’కు సంకేతంగా హైడ్రాను సూచిస్తారు. జర్మనీకి చెందిన హిట్లర్, గ్రీక్ పేరును తన కోర్ టీమ్‌కు పెట్టుకుంటాడా? ఇంత చిన్న లాజిక్ రేవంత్‌రెడ్డి ఎలా మిస్ అయ్యారు? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అటువంటి