హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కరుణ, ప్రేమ, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా క్రిస్టియన్లకు గురువారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతికి ఏసుక్రీస్తు బోధనలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని, ఇంటింటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. ఈ పండుగ అందరి మధ్య సోదరభావం, మత సామరస్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు.