KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగించాలని స్థానిక నాయకులకు కేటీఆర్ సూచించారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం అందక, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులతో అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక్క తలమడుగు మండలంలోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. లక్ష్మణ్ వ్యవసాయ పొలంలో ఉరేసుకుని చనిపోగా.. గుర్రాల ప్రతాప్‌రెడ్డి, పశుల హాసన్న, ధన్నూరు గ్రామానికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వీరిలో అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వందకు పైగా ఘటనలు జరగడం బాధాకరమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా భరోసా కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల రైతుబీమా సాయం 15 రోజుల్లోపు కుటుంబానికి అందేదని గుర్తుచేశారు. పంటల సాగు సమయంలో రైతుబంధు అందేదని, పంటలకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేదని అన్నారు. ప్రస్తుతం యూరియా కొరత, విద్యుత్ సరఫరా సమస్యలు, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు రైతులను వేధిస్తున్నాయని విమర్శించారు. కిసాన్ యాప్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
రైతు కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అయినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలవాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే బాధిత నాలుగు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించినట్లు చెప్పారు. అయితే ఈ సాయం సరిపోదని, రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ, వీటిని ఆత్మహత్యలుగా కాకుండా ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన మరణాలుగా అభివర్ణించారు.
తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగించాలని స్థానిక నాయకులకు కేటీఆర్ సూచించారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మరో ఏడాది ధైర్యంగా ఉండాలని, ఆ తర్వాత కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని, రైతులకు మళ్లీ భరోసా కల్పిస్తారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబాలు మనోధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

