Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Manchu Manoj | అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పట్టపగలే తరగతి గదిలోకి చొరబడిన ఓ దుండగుడు విద్యార్థినిపై విద్యుత్ రంపంతో దాడి చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు.
Manchu Manoj | అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పట్టపగలే తరగతి గదిలోకి చొరబడిన ఓ దుండగుడు విద్యార్థినిపై విద్యుత్ రంపంతో దాడి చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చిన మరో బాలిక ధైర్యసాహసాలను కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత స్పందించారు. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఈ దారుణ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నటుడు మంచు మనోజ్ ఈ ఘటనపై సామాజిక మాధ్యమ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఒక తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. దాడికి గురైన ఇద్దరు బాలికలు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చిన బాలిక అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. అలాగే బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన వైద్యులకు, గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స కోసం తరలింపును సమన్వయం చేసిన ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు, వైద్య బృందాలకు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత విద్యార్థుల కోసం 20 మంది మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి చిన్నారికి, ఉపాధ్యాయుడికి, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన నేరంగా మాత్రమే చూడకూడదని మంచు మనోజ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇళ్లలోనూ, సమాజంలోనూ మహిళలను వస్తువులుగా చూడటం, సరదాగా మాట్లాడుతున్నామనే పేరుతో అగౌరవపరచడం ప్రమాదకరమైన ఆలోచనా విధానాలకు దారితీస్తుందని హెచ్చరించారు. మహిళలను తక్కువగా చూడటం హానికరమని, వేధింపులు, హింసకు పాల్పడేవారికి తప్పనిసరిగా శిక్ష పడాలని స్పష్టం చేశారు. మహిళల పట్ల రోజువారీగా జరిగే అగౌరవాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాలని, వారి పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. మనం కోరుకునే సురక్షితమైన సమాజం మన ఇళ్లలో, చుట్టూ ఉన్న మహిళలతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అందరూ కలిసి మహిళలకు గౌరవం, భద్రత కల్పించే సమాజాన్ని నిర్మించాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

