Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Vande Bharat Sleeper Train | బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 16 కోచ్‌లు ఉన్న ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుంచి బయలుదేరింది.
బెంగళూరు: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 16 కోచ్‌లు ఉన్న ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుంచి బయలుదేరింది. (Vande Bharat Sleeper Train) సోమవారం ఉదయం 6.15 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌కు ఇది చేరుకుంటుంది. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లాజె, పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య, పి.సి. మోహన్, సి.ఎన్. మంజునాథ్ సహా పలువురు ప్రముఖులు ఈ రైలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, బెంగళూరు నుంచి ముంబైకి రాత్రి వేళ నడిచే, ప్రయాణికులకు నిద్రించే సౌకర్యం ఉన్న వందే భారత్ స్లీపర్ రైలు నంబర్ 27652 సోమవారాలు తప్ప వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 2 నుంచి రెగ్యులర్‌గా ఎస్ఎమ్వీటీ బెంగళూరు స్టేషన్ నుంచి రాత్రి 7:45 గంటలకు బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 11:55 గంటలకు సీఎస్ఎమ్టి ముంబైకి చేరుతుంది. ఈ రైలు అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురగి, షోలాపూర్, పూణె, కళ్యాణ్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
మరోవైపు ముంబై-బెంగళూరు మార్గంలో నవంబర్ 3న అధికారికంగా ఈ రైలు ప్రారంభమవుతుంది. తిరుగు ప్రయాణంలో, రైలు నంబర్ 27651 రాత్రి 8:10 గంటలకు సీఎస్ఎంటీ ముంబై స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారాలు తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

