Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Laxma Reddy | ఎల్ నినో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
మహబూబ్ నగర్ : ఎల్ నినో పేరుతో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) ఆరోపించారు. జిల్లాలోని నవాబ్ పేట మండలం అమ్మాపూర్ గ్రామంలో మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎండిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలు కరువు వచ్చినా తట్టుకునే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను డిజైన్ చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా కాళేశ్వరాన్ని నిర్మించి లక్షలాధి ఎకరాలకు నీరందించారని గుర్తు చేశారు. పంటలు వేసుకున్న రైతులకు నీరందించక, కరెంటు ఇవ్వక కాంగ్రెస్ తీరని నష్టం చేస్తుందని విమర్శించారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు .
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం వల్లే ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నవాబ్ పేట లో వందల ఎకరాలు ఎండిపోతే కరువు మండలంగా ప్రకటించలేదని విమర్శించారు. నవాబ్ పేట, మిడ్జిల్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

