వరంగల్‌చౌరస్తా, జూన్ 3: ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఎంజీఎంహెచ్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడి యం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి సురేఖ ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చించారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడా రు. అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రధానంగా మానవ వనరులు, ఆరోగ్యశ్రీ సేవలు, నిధులు, స్కూల్ నర్సింగ్ భవనం పునఃనిర్మాణం, సూపర్ స్పెషాలిటీ సేవలను మెరుపర్చే విషయమై చర్చించామన్నారు. ఎంజీఎం హాస్పిటల్ లో 153 మంది ప్రొఫెసర్లు, వైద్యుల కొరత ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. సెక్యూరిటీ, సానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది ని యామకాలను కలెక్టర్ అనుమతితో నియమించాలని సూ చించామన్నారు. కాలపరిమితి ము గిసిన ఔట్సోర్సింగ్ సం స్థ స్థానంలో మరో సంస్థ త్వరలో బాధ్యతలు చేపడుతుందన్నారు.
ఇటీవల నిర్వహించిన ప్రాంతీయ కంటి వైద్యశాల, సీకేఎం హాస్పిటల్ అభివృద్ధి కమిటీల తీర్మానాలతో పాటు ఎంజీఎం హాస్పిటల్ కమిటీ తీర్మానాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అందిస్తామన్నారు. మెడికల్, నర్సింగ్ విద్యార్ధుల అవసరాలకు తగిటన్లు హాస్టల్ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సురేఖ తెలిపారు. పనిచేయని యం త్రాలను తొలగించడంతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రా సౌండ్, సిటీ స్కాన్ నిర్వహణకు ఏజెన్సీలకు అప్పగిస్తామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధికి మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రూ. 50 లక్షల చొ ప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంజీఎంహెచ్కు అందనున్న రూ.8 కోట్లతో పాటు ఈ నిధులను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఎంజీఎం హా స్పిటల్ అభివృద్ధికి కేఎంసీ అలూమ్ని సభ్యులు సైతం సహకారం అందిస్తారని, బిలియన్ హార్ట్స్ ఫౌండేషన్ రూ.కోటి అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంథ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాథికారి డాక్టర్ సాంబశివరావు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిప్యూటీ సూరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజు, ఆర్ఎంవోలు తదితరులు పాల్గొన్నారు.