Chandrakant Pandit : ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) భారీ షాకిచ్చాడు. ఉన్నట్టుండి బాధ్యతల నుంచి వైదొలిగాడు చంద్రకాంత్. మూడేళ్లుగా కోచ్‌గా కొనసాగిన ఆయన మంగళవారం నాడు నా దారి నేను చూసుకుంటా అంటూ పదవికి రాజీనామా చేశాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఫ్రాంచైజీ కూడా అమోదం తెలిపింది. థాంక్యూ చందు సర్ అంటూ కోల్‌కతా యాజమాన్యం ఎక్స్ వేదికగా వీడ్కోలు పోస్ట్ పెట్టింది.
‘కోల్‌కతాకు కోచ్‌గా విశేష సేవలందించిన చంద్రకాంత్ కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన ఇకపై మా జట్టు హెడ్‌కోచ్‌గా ఉండడు. ఈ మూడేళ్ల సమయంలో మీ అమూల్యమైన సేవలకు ధన్యవాదాలు. కోల్‌కతాను మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిపిన ఘనత మీది. అంతేకాదు మీ క్రమశిక్షణతో, నాయకత్వ నైపుణ్యంతో స్క్వాడ్‌ను పటిష్టంగా మార్చారు. మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్’ అని కోల్‌కతా ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
We wish you the best for your future endeavours, Chandu Sir 🤗
PS: Once a Knight, always a Knight. Kolkata will always be your home 💜 pic.twitter.com/GF0LxX5fIz
— KolkataKnightRiders (@KKRiders) July 29, 2025
అయితే.. హఠాత్తుగా చంద్రకాంత్ వైదొలగడంపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈమధ్యే కోల్‌కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ డబ్ల్యూపీల్ జట్టు యూవీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో.. చంద్రకాంత్ కూడా ఏదైనా డబ్ల్యూపీఎల్ జట్టు కోచ్ పదవి ఆశిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
— KolkataKnightRiders (@KKRiders) July 29, 2025
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ అయిన చంద్రకాంత్ 2022లో కోల్‌కతా కోచ్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ వెటరన్ బ్రెండన్ మెక్కల్లమ్ వారసుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన.. పదిహేడో సీజన్లో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. మెంటార్ గౌతం గంభీర్ సహకారంతో కేకేఆర్‌కు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు చంద్రకాంత్. అతడి కోచింగ్‌లో కోల్‌కతా 42 మ్యాచుల్లో 22 విజయాలు సాధించింది.