Gautam Gambhir | పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. ‘తగ్గేదేలే’ అంటూ వార్నింగ్..?
Gautam Gambhir : భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఓవల్ పిచ్ క్యూరేటర్ అభ్యంతరం తెలిపాడు. దాంతో, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అతడితో వాగ్వాదానికి దిగాడు. అసలు ఎందుకు వీరిద్దరూ గొడవపడ్డారంటే..?
Gautam Gambhir : మాంచెస్టర్‌లో అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత జట్టు ఓవల్ టెస్టుకు సన్నద్దమవుతోంది. నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే ఉండడంతో గట్టిగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది గిల్ బృందం. అయితే.. భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుండగా ఓవల్ పిచ్ క్యూరేటర్ అభ్యంతరం తెలిపాడు. దాంతో, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అతడితో వాగ్వాదానికి దిగాడు. అసలు ఎందుకు వీరిద్దరూ గొడవపడ్డారంటే..?
మంగళవారం రోజు భారత క్రికెటర్లు ఓవల్ మైదానంలో నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్స్ కొటాక్ ఆటగాళ్లను గమనిస్తున్నారు. ఈ సమయంలోనే పిచ్ క్యురేటర్ లీ ఫొర్టిస్( Lee Fortis) అక్కడికి వచ్చాడు. అతడు ఇదేంటీ మీరు ఎక్కువ ఇక్కడ సాధన చేస్తున్నారు? మీకు అనుమతి ఇచ్చింది అక్కడి వరకేగా అని అన్నాడు. మామూలుగానే ముక్కు మీద కోపంతో ఊగిపోయే గౌతీకి అతడలా అనేసరికి చిర్రెత్తుకొచ్చింది.
VIDEO | Indian team’s head coach Gautam Gambhir was seen having verbal spat with chief curator Lee Fortis at The Oval Cricket Ground in London ahead of the last Test match of the series starting Thursday.
After having drawn the fourth Test at Old Trafford, India have a chance… pic.twitter.com/hfjHOg9uPf
— Press Trust of India (@PTI_News) July 29, 2025
‘నువ్వు కేవలం మైదానం సిబ్బంది మాత్రమే. మేము ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటాం. మేము ఏం చేయాలో నువ్వు చెప్పనక్కర్లేదు. మాకు అన్నీ తెలుసు అని ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో’ అని అతడితో తెగేసి చెప్పాడు. గంభీర్ ఒక్కసారిగా అలా అనేసరికి ఫొర్టిస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. బ్యాటింగ్ కోచ్ అతడికి సర్ధి చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా కోచ్, క్యురేటర్ ఫొర్టీస్ల వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
గెలిచి తీరాల్సిందే
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 31 బుధవారం చివరిదైన ఐదో టెస్టు జరుగనుంది. ప్రస్తుతానికి రెండు జట్లు ఆతిథ్య జట్టు రెండేసి విజయాలతో ముందజంలో ఉంది. మాంచెస్టర్‌లో డ్రాతో బతికిపోయిన టీమిండియా గెలిచి తీరాల్సిందే. డ్రా చేసుకున్నా సరే స్టోక్స్ సేన విజేతగా నిలుస్తుంది. సో.. ఏవిధంగా చూసినా ఓవల్ టెస్టు గిల్ బృందానికి చావోరేవో లాంటిదే. కుడి పాదం వేలి గాయంతో వైస్ కెప్టెన్ పంత్ దూరమవ్వడం కొంత ఇబ్బందికరమే. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే.. నాలుగో టెస్టుకు విశ్రాంతితీసుకున్న ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు కోలుకోవడంతో భారత బౌలింగ్ యూనిట్ మరింత బలంగా మారనుంది.
— BCCI (@BCCI) July 28, 2025
ఇవి కూడా చదవండి
- Youth Open Regetta | యూత్ ఓపెన్ రెగెట్టాలో రిజ్వాన్ ముందంజ.. రెండోస్థానంలో బన్నీ
- KTR | 20 నెలల్లోనే కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత.. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి : కేటీఆర్
- Viral news | అర్ధరాత్రి ప్రియురాలి కోసం వెళ్లి గ్రామస్తుల చేతిలో తన్నులు తిన్న ప్రియుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

