Bethany Academy | పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని బెతానీ అకాడమీ స్కూల్ ముందుకొచ్చింది. ‘ఏ టొబాకో ఫ్రీ జనరేషన్’ థీమ్‌తో విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ బెతానీ అకాడమీ స్కూల్ నుంచి మొదలై హై టెన్షన్ రోడ్డు, ఇందిరా గాంధీ విగ్రహం, అంబేద్కర్ గాంధీ విగ్రహం, సెలెక్ట్ థియేటర్, బొల్లారం రోడ్డు సూర్య నగర్ కాలనీ బస్టాప్ నుంచి తిరిగి బెతానీ అకాడమీ స్కూల్ వరకు సాగింది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాన్ని మూడు గంటల సమయంలో జరిగిన ఈ ర్యాలీ చిన్నారుల నినాదాలు, ఆలోచింపజేసే బుర్రకథలతో, జాగృతి కలిగించే పద్యలహరులతో, వీధి నాటకాలతో జనాలందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లీనా వారణాసి మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తమ చైర్మన్ వనజ ఆల్వాల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ర్యాలీ రూపంగా నిర్వహించామని తెలిపారు. ధూమపానం, పొగాకు మానవ మనుగడను హరిస్తున్నాయని, పసిపిల్లలు కూడా దీనికి బానిసలు అవుతున్నారని అన్నారు. ధూమపానం వల్ల కలిగే నష్టాలు తెలియకుంటే రాబోయే భావితరాల భవిష్యత్తు శూన్యంగా మారుతుందని తెలిపారు. ధూమపానం లేని నవ సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.
Bethany Academy1