Nagarjuna | కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. టాలీవుడ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కుబేర టైటిల్‌కు భిన్నంగా ధనుష్ బిచ్చగాడి గెటప్‌లో ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున గెటప్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు.
ఓ కంటైనర్ లారీ నిండా డబ్బులు ఉండగా.. వర్షంలో గొడుగు పట్టుకుని.. కళ్లద్దాలు పెట్టుకుని నాగార్జున ఆ డబ్బునే చూస్తుంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వర్షపు నీటిలోనే నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక నోటు కింద పడి ఉండటం చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత తన పర్స్‌లో నుంచి కొంత డబ్బు తీసుకుని వెనక్కి వచ్చి కంటైనర్‌లో పెట్టేస్తాడు. మొత్తంగా నాగ్ లుక్‌తో పాటు ఈ సీన్ అదిరిపోయింది. నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది.
కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.