వేంసూరు, మార్చి 7 : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, దానికి నిదర్శనమే మహిళా సంబురాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ, ఆశ, ఆరోగ్య, వైద్యశాఖల్లో మహిళలను ఎమ్మెల్యే సత్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 37 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
పెనుబల్లి, మార్చి 7 : సోమవారం మహిళా సంబురాల్లో భాగంగా సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
సత్తుపల్లి, మార్చి 7 : మండల పరిధిలోని నారాయణపురం, కాకర్లపల్లి, రేజర్ల, సింగరేణి ఓసీలతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో మహిళాబంధు వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గ్రామాల్లో మహిళలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. కాకర్లపల్లిలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళా ఉద్యోగులను సన్మానించారు.
కల్లూరు, మార్చి 7 : టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు మండలంలో పర్యటించి పథకాల కరపత్రాలను అందజేశారు. పాలెపు రామారావు, బీరవల్లి రఘు, కట్టా అజయ్‌బాబు, పసుమర్తి చందర్రావు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, మార్చి 7 : కొత్తూరు రైతువేదిక వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. గ్రామంలోని ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ, గ్రామదీపికలను సన్మానించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తల్లాడ, మార్చి7 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నది సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడలో మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు భారీ ప్రదర్శన నిర్వహించారు. తల్లాడ రైతువేదికలో మహిళా ఉద్యోగులను సత్కరించారు. అనంతరం 80 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు.
కొణిజర్ల, మార్చి7 : సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి, జడ్పీటీసీ పోట్ల కవిత ఆధ్వర్యంలో మహిళాబంధు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కారేపల్లి,మార్చి 7 : విశ్వనాథపల్లిలో ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ మాలోత్ శకుంతల వైద్య, అంగన్వాడీ సిబ్బందిని సన్మానించారు. కారేపల్లిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు,నాయకులు సీఎం కేసీఆర్ ప్లెక్సీకి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.