మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23: ఓటు శక్తిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ‘నా ఓటే నా భవిష్యత్తు’, ‘ఒక ఓటుకున్న శకి’ అంశాలపై అవగాహన పోటీలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో పాల్గొనేందుకు వయోపరిమితి లేదు. క్విజ్, నినాదాలు, పాటలు, వీడియో తయారీ, పోస్టర్ డిజైన్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. అందరూ పాల్గొనవచ్చు. ఎంట్రీలను మార్చి 15వ తేదీ నాటికి నమోదు చేసుకోవాలి. విజేతలకు నగదు బహుమతులు, ఈ-సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. పాటలు, పోస్టర్ డిజైన్, వీడియో మేకింగ్ పోటీలు మూడు విభాగాలుగా (ఇన్స్టిట్యూషనల్, ప్రొఫెషనల్, అమెచ్యూర్) ఉంటాయి. ప్రతి విభాగంలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి.
పాటలు, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలు మూడు విభాగాల్లో (ఇన్స్టిట్యూషనల్, ప్రొఫెషనల్, అమెచ్యూర్) జరుగుతాయి. నాలుగు బహుమతులు (ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక ప్రశంస) నగదు బహుమతులు ఉంటాయి. ఏయే విభాగంలో ఎంతెంత నగదు బహుమతి అందుతుందో చూద్దాం.
ఇలా పాల్గొనాలి ఈ పోటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని http://ecisveep.nic.in/contest/ లో పొందవచ్చు. ఎంట్రీలను voter-contest@edi.gov.in మెయిల్‌కు పంపాలి.