వైరా, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని అన్నదాతల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. వైరా మున్సిపాలిటీలోని 14వ వార్డులో నిర్మించిన సోమవరం క్లస్టర్ రైతువేదికను రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మిట్టపల్లి నాగి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతువేదికలు వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహనను పెంపొందిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఈ రైతువేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్‌ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఆత్మ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు షేక్ లాల్‌మహ్మద్, దారెల్లి కోటయ్య, వనమా విశ్వేశ్వరరావు, మచ్చా నరసింహారావు, బాణాల వెంకటేశ్వరరావు, దార్న రాజశేఖర్, కాపా మురళీకృష్ణ, పసుపులేటి మోహన్‌రావు, కట్టా కృష్ణార్జునరావు, గుమ్మా రోశయ్య, సూర్యదేవర శ్రీధర్, మరికంటి శివ, ఏదునూరి శ్రీను, ఏడీఏ బాబురావు, ఏవో శ్రీరామోజి పవన్‌కుమార్, ఏఈవో సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ఫోన్లను ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ రూ.400గా ఉన్న ఆశ వర్కర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.