వికారాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం. ఓ వైపు ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. మరోవైపు సొంత పార్టీ నాయకులు, శ్రేణులు పార్టీని వీడుతుండడంతో హస్తం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు తలనొప్పిగా మారింది.
పవర్లోకి వచ్చి 21 నెలలు దాటినా ఇచ్చిన హామీలను అమ లు చేయకుండా సబ్బండ వర్ణాలకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. రైతుభరోసా ఎగ్గొట్టడం, పింఛన్లు పెంచకపోవడం, ఇందిరమ్మ ఇండ్లకు అందని ఆర్థిక సాయం, రైతుబీమా కోసం అన్నదాతల ఎదురుచూపు, ఉద్యోగులకు అందని జీతాలు, గ్రామాలకు రూపాయి నిధులివ్వకపోవడంతో స్తంభించిన పాలన, పల్లెలు సమస్యలతో సతమతమవుతుండడంతో కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అదేవిధంగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ పంటకు వేసే ఎరువులనూ సరిపడా అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది. అంతేకాకుండా రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపులార్) విషయంలో నూ జిల్లాలోని ఒకట్రెండు ఎకరాలున్న పేద రైతుల భూముల నుంచి ట్రిపులార్ అలైన్మెం ట్ వెళ్లేలా మార్చడంతో కాంగ్రెస్ పార్టీపై జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధికార పార్టీని వదలి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ ఎమ్మెల్యేల గెలుపునకు కష్టపడిన వారంతా ఒక్కొక్కరిగా గులాబీ కండువా కప్పుకొంటున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒకట్రెండు నెలలుగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తామని భావించిన నాయకులు కారెక్కుతుండడం గమనార్హం.
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి తదితరులు నిత్యం ప్రజ ల్లో ఉంటూ, సమస్యలపై పోరాటం చేస్తుండ డంతో కాంగ్రెస్ పాలన, ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన గ్రా మం నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావ డం గమనార్హం. చేవెళ్ల సెగ్మెంట్లో ఎమ్మెల్యేగా యాదయ్య గెలవడంలో నవాబుపేట మండలంలో కృషి చేసిన బలమైన నాయకుడు బందెయ్యగౌడ్ తన అనుచరులతో కలిసి మూడు రోజుల కిందట మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సబ్బండ వర్ణాలకు అన్యాయం
కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమైంది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్ణాలకు అన్యాయం చేస్తున్నది. గత 21 నెలల నుంచి పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు తదితర పథకాలను అమలు చేసి ఆపద్బంధావుడిలా కేసీఆర్ పేరొందితే.. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే అన్ని వర్గాల ప్రజలను కష్టాల పాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మొదట రైతులను నమ్మించి మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం తర్వాత ఒక్కో వర్గానికి తమ అసలు నైజాన్ని చూపుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతులు నేడు పీకల్లోతు కష్టా ల్లో మునిగిపోయారు. పంట సాగు మొదలెట్టినప్పటి నుంచి పండించిన పంటను అమ్మేవరకూ ఏ కష్టం రాకుండా కం టికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే…కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల పాలు చేసి నట్టేట ముంచుతున్నదని జిల్లా రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని కొడంగల్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో జిల్లావాసులంతా సంబురపడ్డారు. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్‌పై తప్ప జిల్లాలోని మిగతా సెగ్మెంట్లను అతడు పట్టించుకోవడంలేడని ప్రజలకు అర్థమైంది. వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెం ట్ల అభివృద్ధిని విస్మరించడంతోపాటు సాగునీరందించే పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపివేశారు.
మరోవైపు బీఆర్ఎస్ హయాంలో ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులను సొంతం చేసుకున్న పంచాయతీల్లో ప్రస్తుతం పాలన అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పం చాయతీలకు రూపాయి కూడా నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది.