వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది ఆమె ఓటీటీ రిలీజ్ ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ‘భోళాశంకర్’ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో మరే భారీ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో కీర్తి సురేష్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. దిల్‌రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. కొద్దిరోజులుగా కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం చివరకు కీర్తి సురేష్‌ను ఖరారు చేశారని తెలిసింది.
రాయలసీయ నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే రాయలసీమ యాసలో మంచి పట్టు సాధించారు. ఇందులో రాజశేఖర్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తొలిసారి నాయకానాయికలుగా నటిస్తుండటం విశేషం. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.