Meenakshi Chaudhary | ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ఆ తర్వాత హిట్ 2, గుంటూరు కారం సినిమాలతో హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. గతేడాది మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఎప్పుడూ ఏదో ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ కాస్త బ్రేక్ తీసుకొని వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకుంది. ఇంతకీ మీనాక్షి చౌదరి ఎక్కడికెళ్లిందనుకుంటున్నారా..? ఈ భామ జపాన్ దేశానికి టూర్ వేసింది. స్టైలిష్ డ్రెస్‌లో ఉన్న మీనాక్షి జపాన్ వీధుల్లో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని మాన్సూన్ అందాలను ఆస్వాదించింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఓ వైపు ఛమక్కుమని మెరుస్తున్న చెవిపోగులు, మరోవైపు సాధారణ పోనీటైల్ లాంటి జుట్టుతో ఉన్న ఈ చిన్నది అందమైన చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తోంది. ప్రతీ వీధిలో మీనాక్షి చౌదరి దిగిన ఫొటోలు జపాన్ టూర్‌ను ఎలా ఎంజాయ్ చేసిందో చెప్పకనే చెబుతున్నాయి. జపాన్ వెకేషన్లోని ప్రతీ ఫ్రేమ్ తన ట్రావెల్ డైరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
‘కొన్ని యాదృచ్ఛిక విషయాలు, సంఘటనలు మనలో శాశ్వత ముద్ర వేస్తాయి. ఈ అద్భుతమైన రోజు నుండి నాకు అలాంటి ఒక జ్ఞాపకం లభించినందుకు నేను కృతజ్ఞురాలినని భావిస్తున్నాను. జపాన్‌లో మేము ఒక అందమైన కేఫ్‌ను గుర్తించాం. అద్బుతమైన వర్షాభావ దృశ్యాల నుండి అక్కడి అందమైన మనుషులతో అందంగా తయారు చేసిన జపనీస్ టీ వరకు అన్నీ ఆస్వాదించాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ పెట్టింది.
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మీనాక్షి చౌదరి. ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది.
జపాన్ వీధుల్లో ఇలా..
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
Venky 77 | వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫన్ రైడ్.. వెంకీ 77 సెట్స్‌పైకి వెళ్లే టైం ఫిక్స్..!