అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దేవగుడి’. స్వీయ దర్శకనిర్మాణంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దేవగుడి చుట్టూ అల్లుకున్న రహస్యం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది.
సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యం ఉండే చిత్రమిది’ అన్నారు. ఈ సినిమాలో తాము ఛాలెంజింగ్ రోల్స్ పోషిస్తున్నామని నాయకానాయికలు తెలిపారు. రఘుబాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.మదీన్, దర్శకనిర్మాణం: బెల్లం రామకృష్ణారెడ్డి.