హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఉప్పల శివ ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొని వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వాలంటీర్లు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రధాన ద్వారం నుంచి ఎన్ఎస్ఎస్ డ్రమ్స్ వాయించుకుంటూ వాలంటీర్లు చప్పట్లు కొడుతూ శివను కళాశాల ప్రిన్సిపాల్ వద్దకు తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ శివను శాలువాతో సత్కరించి కాలేజీ నుండి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నందుకు అభినందించారు.
కేయూ నుంచి ఈ పరేడ్లో పాల్గొనే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి శివ అని ప్రిన్సిపాల్ కొనియాడారు. కాలేజీ కీర్తిని ఢిల్లీ వరకు తీసుకెళ్లారని అభినందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సీతారాములు, గంగిశెట్టి శ్రీనివాస్, సంధ్యారాణి, ధనసింగ్, ఎన్సిసి ఆఫీసర్లు రాజేందర్, ప్రసూన, స్టాప్ క్లబ్ సెక్రటరీ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, ఐక్యూఏసి కోఆర్డినేటర్ శ్రీనాథ్, పరీక్షల నియంత్రణ అధికారి శివనాగశ్రీను, అధ్యాపకులు కోమల, విజయలక్ష్మి, సమ్మయ్య, రవీందర్, జె.చిన్న, వెంకన్న విద్యార్థులు పాల్గొన్నారు.