జలవనరుల క్రాంతదర్శి కేసీఆర్!
కొందరికి అయిష్టంగా ఉండొచ్చు, మరికొందరికి చెప్పడానికి భారంగా ఉండొచ్చు! కానీ తెలంగాణ జలవనరుల క్రాంతదర్శి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ఎల్ నినో నేపథ్యంలోనైనా ఆమాట చెప్పకపోతే మనల్ని మనం వంచన చేసుకున్నట్టే అవుతుంది.
కొందరికి అయిష్టంగా ఉండొచ్చు, మరికొందరికి చెప్పడానికి భారంగా ఉండొచ్చు! కానీ తెలంగాణ జలవనరుల క్రాంతదర్శి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ఎల్ నినో నేపథ్యంలోనైనా ఆమాట చెప్పకపోతే మనల్ని మనం వంచన చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే కేసీఆర్
పాలన సాగించారు. భూగర్భ జలవనరుల పెంపకం, రక్షిత తాగునీటి వనరుల కల్పనలో, సాగునీటి వనరుల అభివృద్ధిలో ఆయన తనదంటూ ఒక ప్రత్యేక ముద్రతో ‘భగీరథ’ ప్రయత్నం చేశారు. అది ఎవరూ విస్మరించడానికి వీలులేనిది.
నాలుగు నెలలుగా ఎల్ నినో తీవ్ర రూపం ప్రభావం చూపుతున్నది. తెలంగాణ జలసంక్షోభం తట్టుకొని నిలబడింది అంటే అది కేసీఆర్ దీర్ఘకాలిక జల ప్రణాళిక ఫలితమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే, తెలంగాణ విభజన అనంతరం తొలి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే 2015-16లోనే ఎల్ నినో వచ్చింది. దాని పర్యవసానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దీర్ఘకాలిక నీటి వనరులు కల్పన దిశగా పయనించాయి. తెలంగాణ సముద్ర మట్టానికి 300-600 అడుగులు ఎత్తున ఉన్న పీఠభూమి కావడం, వర్షాధార భూభాగం కావడం, చెంతనే నదులు ఉన్న దిగువన ప్రవహించడం వల్ల సాగు, తాగునీటి వనరుల కల్పన 70 ఏండ్లుగా పాలకులకు ఒకింత కష్టమైన దశలో, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేశారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడంలో కీలకమైన 27వేల పైచిలుకు చెరువుల మరమ్మతులు, పూడిక, తూటుకాడ తొలగింపు, ఆధునీకరణ ద్వారా జల ప్రణాళికను అమలు చేశారు.
రక్షిత నీటి పథకాలతో అనుసంధానం చేస్తూ సుదీర్ఘ రక్షిత తాగునీటి ప్రణాళికను పదివేల గ్రామ పంచాయతీల్లో అమలు పరిచారు. కరువు కాటకాలు, ఎల్ నినో లాంటి విపత్తులు ఎదురైనప్పుడు సవాళ్లను ఎదుర్కొనే దిశగా సముద్రం పాలవుతున్న గోదావరి నీటిని వాడుకోవడానికి ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక ముందుకు తేవడమే కాక యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసి, వినియోగంలోకి తెచ్చారు. కరువు జిల్లాల్లో జల దృశ్యాలు చూపించారు. అంతేకాకుండా తన భూగర్భజల పెంపుదల విజనరీ ప్రణాళికలో భాగంగా పారెస్ట్ డిపార్టుమెంటును అనుసంధానం చేసి కాంటూరు స్టెంచెస్ తవ్వించారు. అటు వర్షపునీరు ఒడిసిపట్టడం, ఇటు నది, చెరువు నీటిని వినియోగంలోకి తేవడం, అనుసంధానం ద్వారా 2014-2024 నాటికి తెలంగాణలో భూగర్భ జలవనరులు 4.26 మీటర్లు పెరిగి రక్షిత స్థితికి చేరుకున్నాయి.
కనీసం సగటు భూగర్భ జలవనరుల మట్టం 20 మీటర్లు ప్రమాణంగా తీసుకుంటే 2014లో తెలంగాణలో 20 మీటర్ల కంటే లోతులో 11,026 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన భూభాగం ఉన్నది. 2024 నాటికి ఆ భూబాగం 1398 చదరపు కిలో మీటర్లకు తగ్గింది. అంటే దశాబ్దకాలంలో 9,628 చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో భూగర్భ జలవనరుల పెరుగుదల స్పష్టంగా కనిపించింది.
2026 గణాంకాలు చూస్తే సగటు 20 మీటర్ల లోతు కంటే ఎక్కువ వెళ్లిన భూభాగం 4,600 చదరపు కిలో మీటర్లకు పైగా ఉండడం ఇక్కడ గమనార్హం. భూగర్భ జలవనరులు సురక్షిత స్థితికి చేరుకోవడం, విద్యుత్తు ఉత్పత్తిలో పెరుగుదల మూలంగా నిరంతరాయ విద్యుత్తు సరఫరా పెరగడం వల్ల రైతుల్లో జల భరోసా ఏర్పడింది. ఫలితంగా 2014లో 16 లక్షల బోరుబావులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 31 లక్షలుగా ఉన్నది. అంటే పదేండ్ల కాలంలో రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. జలవనరుల రక్షిత స్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది. ఆహార భద్రతలో భాగమైన వరి ఉత్పత్తిలో 90 వేల మెట్రిక్ టన్నుల నుంచి 148 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దశకు చేరుకొని 77 శాతం పెరుగుదలతో వరి పంట ఉత్పత్తిలో 5వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి చేరుకోగలిగాం. పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను అధిగమించగలిగాం. ప్రపంచ దేశాలన్నిటికీ బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.
రాష్ట్రంలో గడిచిన దశాబ్ద కాలంగా రోడ్లు నిండుగా ధాన్యం రాసులు కుప్పలుగా ఖరీఫ్, రబీ సీజన్లో కనిపించేవి. ఫలితంగా తెలంగాణ ఆహార భద్రతకు కీలక రాష్ట్రంగా మారడమే కాకుండా పేదలకు సరసమైన ధరకు బియ్యం లభ్యమయ్యే సురక్షిత మార్కెట్ సౌకర్యం ఏర్పడింది. వీటన్నింటినీ చూసినప్పుడు కేసీఆర్ జల ప్రణాళికను, ఆయన ముందుచూపును అభినందించకుండా ఉండలేం. అప్పుడు, ఇప్పుడు చాలా మంది మేధావులు తెలంగాణ జలవనరుల అభివృద్ధిని వక్రదృష్టితో చూస్తున్న వారు లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లు మరమ్మతు చేసి ఎల్ నినో విపత్తులో వాడుకొని ఉండి ఉంటే కొంతలో కొంతైనా భూగర్భ జల పరిరక్షణతోపాటు, హైదరాబాద్ లాంటి నగరాలకు నీటికొరత లేకుండా ఉండి ఉండేది. గత ప్రభుత్వం 90 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచడం దారుణం. ప్రస్తుత ప్రభుత్వం భేషజాలకు పోకుండా వర్షాకాలంలో వాడకపోయినా విపత్తు కాలంలోనైనా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవచ్చు కదా! నేడు ఈ ప్రభుత్వమైనా, రేపు మరో ప్రభుత్వమైనా వనరులను వాడుకొని ముందుకు పోవాల్సిందే. అంతే కానీ, వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. అది సర్వ సాధారణ సూత్రం.
తమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు 148 అడుగుల నుంచి 152 అడుగులుకు పెంచి గ్రావిటీ ద్వారా నీరు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. కానీ ప్రజల జీవితాలపై ఎల్ నినో ముప్పు పొంచి ఉన్న దశలో చర్చలు, హామీలు, వాగ్దానాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉపశమనం కలిగించలేవు. అవకాశం ఉన్న మేర తెలంగాణ ప్రజల రక్షణకు ఉన్న కాళేశ్వరం లాంటి వనరులు వాడుకోవడమే మంచిది.
ఇదే సంక్షోభం మరికాస్తా ముదిరితే భూగర్భ జలవనరులు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే హైదరాబాద్‌తోపాటు అనేక జిల్లాల్లో తాగునీటి వనరు దొరకని ప్రమాదం పొంచి ఉన్నది. ప్రకటనల ద్వారా ప్రజల్ని అప్రమత్తం, సన్నద్ధం చేయడం ఒక భాగమైతే ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండేలా చూడటం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. కరువు జిల్లాలు ప్రకటించినప్పటికీ అన్నింటికంటే ముందు ధాన్యం బ్లాకు మార్కెట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అదుపు చేయాల్సి ఉన్నది. రానున్నది వేసవికాలం గతంలోనే తెలంగాణ రాష్ట్రం 46 డిగ్రీల వేసవి ఎండతీవ్రత చవిచూశాం. ఈ ఏడాది ఎల్ నినో వల్ల మరో రెండు మూడు డిగ్రీలు పెరిగితే ప్రజలు తట్టుకోవడం కష్టం. ఏ పాలకులైనా దార్శనికతతో చేసిన ప్రణాళికలు దీర్ఘకాలిక లక్ష్యాలుగా నెరవేర్చుతాయి. ఇప్పుడు ఎల్ నినో నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు కచ్చితంగా చేయగలిగిన పని ఏంటంటే ప్రజల సాగునీటి, తాగునీటి శాశ్వత ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి.
ఎన్.తిర్మల్
9441864514
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

