భూసేకరణ కాకుండానే పనులా?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో బుద్వేల్ నుంచి పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నాచారం వరకు నిర్మించతలపెట్టిన 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-2 ప్రాజెక్టుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.5,060 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినప్పటికీ పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
- రేడియల్ రోడ్డు-2 ప్రాజెక్టుపై వ్యతిరేకత
- మొత్తం 1,486.30 ఎకరాల సేకరణకురూ.3,800 కోట్ల కేటాయింపు
- పరిహారంపై స్పష్టత ఇవ్వని సర్కార్
- ఇప్పటికే 902.16 ఎకరాల సేకరణకు అవార్డులు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో బుద్వేల్ నుంచి పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నాచారం వరకు నిర్మించతలపెట్టిన 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-2 ప్రాజెక్టుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.5,060 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినప్పటికీ పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో వేల ఎకరాల భూములను సేకరిస్తుండటంపై స్థానిక రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.
కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్లాట్ల మారెట్ విలువలను అధికారులు ఇప్పటికీ స్పష్టంగా ఖరారు చేయకుండానే భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-2 నిర్మాణం కోసం మొత్తం 1,486.30 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,800 కోట్లు కేటాయించింది. దీంతో అధికారులు ఇప్పటికే 902.16 ఎకరాలకు భూసేకరణ అవార్డులు జారీచేశారు.
ఇంకా దాదాపు 600 ఎకరాల భూమిని తీసుకోవాల్సి ఉండటంతో గ్రామీణ ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతామంటూ రోడ్లపైకి వస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-2ను రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని 41 గ్రామాల మీదుగా నిర్మించనున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 44.70 కిలోమీటర్ల మేర 21 గ్రామాల్లోని 831.36 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 31.50 కిలోమీటర్ల మేర 18 గ్రామాల్లోని 558.18 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 5.05 కిలోమీటర్ల మేర 2 గ్రామాల్లోని 96.16 ఎకరాల భూమి రోడ్డు నిర్మాణం కిందకి వెళ్లనున్నది.
సర్వీస్ రోడ్లను పట్టించుకోరా?
నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు సర్వీస్ రోడ్లపై బీటీ (తారు) వేయకుండా వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 75 మీటర్ల రైట్ ఆఫ్ వేతో 4 వరుసల ప్రధాన రహదారిని మాత్రమే నిర్మించి, స్థానిక గ్రామీణ ప్రజల రోజువారీ రాకపోకలకు అవసరమైన సర్వీస్ రోడ్లను పట్టించుకోకపోవడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం రూ.3,439.15 కోట్ల వ్యయంతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-2 ప్రాజెక్టును ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా విభజించింది. ప్యాకేజీ-1 కింద బుద్వేల్ నుంచి షాబాద్ వరకు 29.50 కి.మీ. రోడ్డును రూ.1,286.03 కోట్లతో, ప్యాకేజీ-2 కింద షాబాద్ నుంచి గూడూరు వరకు 27 కి.మీ. రోడ్డును రూ.1,071.58 కోట్లతో, ప్యాకేజీ-3 కింద గూడూరు నుంచి నాచారం వరకు 24.65 కి.మీ. రోడ్డును రూ.1,081.54 కోట్లతో నిర్మించనున్నారు.
న్యాయమైన పరిహరం చెల్లించాకే పనులు మొదలుపెట్టాలి..
ఈ మూడు ప్యాకేజీల పనులను టెండర్ల ద్వారా ఎన్సీసీ లిమిటెడ్, బీవీఎస్సార్ కన్స్ట్రక్షన్స్, జీకేసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అప్పగించడంతో ఆ సంస్థలు పనులు మొదలుపెట్టాయి. దీంతో తమ సమస్యలను, సర్వీస్ రోడ్ల ఆవశ్యకతను గాలికొదిలేసి ఈ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మారెట్ ధరతో తమకు పూర్తిస్థాయిలో న్యాయమైన పరిహారం ఇవ్వడంతోపాటు సర్వీస్ రోడ్లను తారు రోడ్లుగా నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు రేడియల్ రోడ్డు-2 పనులను కొనసాగనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యలను పరిషరించకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే నిర్మాణ ప్రాంతాల్లో పనులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

