కబడ్డీ జట్లకు టైటిళ్లు
అరంగేట్ర కామెన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు అదరగొట్టాయి. తొలి టోర్నీలోనే భారత పురుషుల, మహిళల జట్లు సంపూర్ణ ఆధిపత్యంతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి టైటిళ్లు సొంతం చేసుకున్నాయి.
- కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారత్
అహ్మదాబాద్: అరంగేట్ర కామెన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు అదరగొట్టాయి. తొలి టోర్నీలోనే భారత పురుషుల, మహిళల జట్లు సంపూర్ణ ఆధిపత్యంతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. మహిళల విభాగంలో ఓటమెరుగకుండా ఫైనల్ చేరిన భారత్.. 35-15తో ఉగాండాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.

సాక్షి.. 10 రైడ్లకు వెళ్లి ఏకంగా తొమ్మిది పాయింట్లు పట్టుకొచ్చి టాప్ స్కోరర్‌గా నిలిచింది. అబ్బాయిల విషయానికొస్తే ఫైనల్లో భారత్.. 54-20 తో శ్రీలంకను ఓడించింది. హాఫ్ టైమ్ ముగిసేసరికే 30-10 ఆధిక్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న భారత్.. రెండో అర్థభాగంలోనూ అదే జోరును కొనసాగించి జయకేతనం ఎగురవేసింది. ఆదిత్య షిండే 10 పాయింట్లతో మెరిశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

