KTR | రైతులు మంచిగుండాలని కీలక నిర్ణయాలు తీసుకున్న నాయకుడు కేసీఆర్ : కేటీఆర్
KTR | కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా మన సింగరేణికి కొత్త జీవం పోసి.. బొగ్గు ఉత్పత్తి చేసి విద్యుదుత్పత్తి కేంద్రాలు కట్టి.. 60 ఏండ్ల కరెంట్ కష్టాలు తీర్చి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు.
KTR | 2014లో కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు.. అప్పటికి సమైక్యపాలనలో, కాంగ్రెస్ పాలన నీటి తీరువా కట్టించేది. నీళ్లకు పన్ను ఉండే.. కానీ కేసీఆర్ రాగానే కీలక నిర్ణయం తీసుకున్నరు.. చెరువులను బాగు చేయడంతోపాటు నీటి తీరువా శాశ్వతంగా రద్దు చేసి అప్పటిదాకా నీటి పన్ను రూ.300 కోట్ల బకాయిలు ఉంటే మాఫీ చేసిర్రు కేసీఆర్ అని అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నిర్మల్ రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సమైక్యపాలనలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ కష్టాలు ఎన్నడూ కూడా రోజులకు 4గంటలు కరెంట్ వ్యవసాయానికి ఇచ్చింది లేదు.. మరి ఆ పరిస్థితి నుంచి కేవలం 6 నెలల లోపే కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా మన సింగరేణికి కొత్త జీవం పోసి.. బొగ్గు ఉత్పత్తి చేసి విద్యుదుత్పత్తి కేంద్రాలు కట్టి.. కరెంట్ ఎక్కడుంటే అక్కడ కొనుగోలు చేసి తీసుకొచ్చి జనరేటర్లు, ఇన్వర్టర్లు బంద్ అయి 60 ఏండ్ల కరెంట్ కష్టాలు తీర్చి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని పునరుద్ఘాటించారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌లో రైతులకు అప్పుల బాధ, ఆత్మహత్యల బాధ.. మిత్తీలు మీద పడి రైతులు ఆగమైన పరిస్థితి. కేసీఆర్ అందుకే ఒక నిర్ణయం తీసుకున్నరు.. అప్పు నుంచి రైతును విముక్తి చేయాలి. రుణ విముక్తి జరగాలే.. భారతదేశంలో రైతు దగ్గర భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద.. ఇంకో పేరు మీద తీసుకున్న ప్రభుత్వాలున్నయి.. ప్రభుత్వానికి కట్టుడే తప్ప రైతుకు ఇచ్చిందేమి లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80ఏండ్లు అయితుంది.. భారతదేశంలోనే రైతుకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచన చేసిన మొట్టమొదటి ఓకే ఒక్క నాయకుడు ఎవరు..? ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. 11 సార్లు 73 వేల కోట్ల రూపాయలు 11 దఫాలుగా 11 పంటలకు వేసింది కేసీఆర్ దేనికోసం..? ఆ రోజు నాట్లేసే టైం వస్తే మీ ఫోన్లో టింగ్ టింగ్‌మని మోగుతుండే.. మా నిర్మల్‌లో ఉండే రైతన్నలను అడుగుతున్నా. ఎట్లుండే ఎట్లయింది పరిస్థితి అని ఒక్కసారి మీరు ఆలోచించాలని అడుగుతున్నా..
రూ.5 లక్షల రైతు బీమా తెచ్చిన నాయకుడు..
తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు.. 5 ఎకరాలోపున్నవాళ్లే 93 శాతం మంది ఉన్నారు. వాళ్లంతా మంచిగుండాలే.. ఎందుకంటే అర ఎకరం, ఎకరం ఉన్న రైతు ఏమైనా జరుగకూడనిది జరిగి ఇంటి కుటుంబ పెద్ద చనిపోతే ఆ రైతు కుటుంబం ఆగమైతదనే బాధతో కేసీఆర్ ప్రపంచంలోనే ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు.. రైతు ఎట్లా చనిపోయినా, గుండెపోటుతో, పాముకాటుతో, యాక్సిడెంట్‌తో చనిపోయినా.. ఆ కుటుంబానికి ధీమా ఉండాలని రూ.5 లక్షల రైతు బీమా తెచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
అంతేకాదు కరోనా టైంలో కూడా పండించిన ప్రతీ గింజా కొన్నరు. 7-8 వేల కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ ఊరూరికి కల్లం దగ్గరికి వచ్చి కొని.. అక్కడి నుంచి వారం , పది రోజుల్లోపల మీ ఖాతాలో పైసలుపడేటట్టు చేసింది కేసీఆర్ . అన్నింటికి మించి కృష్ణా, గదావరి నదుల్లో ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి.. మన చెరువులు బాగు చేయడమే కాదు.. ఆ చెరువులు నింపి వాగుల మీద చెక్ డ్యాములు కృష్ణా, గోదావరిలో నీటిని ఒడిసి పట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు -రంగారెడ్డి, సీతారామ, భక్త రామదాసు, మన దగ్గర కట్టిన సదర్మాట్ బ్యారేజ్ అయితే ఏంటి… ఇవన్నీ కూడా తొమ్మిదిన్నర,పదేండ్ల కాలంలోనే మన హక్కులను కాపాడటానికి, మన రైతులు, మన వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు కేసీఆర్ బ్రహ్మాండంగా నాడు మన కోసమో ఈ కార్యక్రమాలు చేశారని మీకు తెలుసునన్నారు.
గులాబీమయమైన నిర్మల్ ✊🏻
రైతు గర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/NaaDPUJldY
— BRS Party (@BRSparty) November 11, 2026
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతులు మంచిగుండాలని కీలక నిర్ణయాలు తీసుకున్న నాయకుడు కేసీఆర్ : కేటీఆర్
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

