Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Crime News | వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి ప్రియుడితో కలిసి కన్నకొడుకునే హత్యచేసింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెళగావి (Belagavi) జిల్లా మాళమారుతి పోలిస్‌స్టేషన్ పరిధిలో నవంబర్ 1న చోటుచేసుకున్న ఈ ఘటనలో తల్లే హంతకురాలిగా తేలింది. దాంతో పోలీసులు మృతుడి తల్లిని, ఆమె ప్రియుడిని, ఈ హత్యకు సహకరించిన ప్రియుడి స్నేహితులను అరెస్ట్ చేశారు.
Crime News : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి ప్రియుడితో కలిసి కన్నకొడుకునే హత్యచేసింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెళగావి (Belagavi) జిల్లా మాళమారుతి పోలిస్‌స్టేషన్ పరిధిలో నవంబర్ 1న చోటుచేసుకున్న ఈ ఘటనలో తల్లే హంతకురాలిగా తేలింది. దాంతో పోలీసులు మృతుడి తల్లిని, ఆమె ప్రియుడిని, ఈ హత్యకు సహకరించిన ప్రియుడి స్నేహితులను అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయ్ నారాయణ (24) అనే యువకుడు, తన తల్లి మీనా నారాయణ (44) తో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. కొన్నేళ్ల కిందట విజయ్ భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. స్థానికంగా ఓ బ్లూటీ పార్లర్లో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆ బ్యూటీ పార్లర్లో మహారాష్ట్రలోని గడెహింగ్లజ తాలూకా తేరణి గ్రామానికి చెందిన రాకేశ్ జామూని కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఈ బంధం విజయ్ నారాయణ కంటపడటంతో అతడు తల్లిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తీరు మార్చుకోవాలని మందలించాడు. దాంతో తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న విజయ్ నారాయణను అడ్డు తొలగించుకోవాలని మీనా, ఆమె ప్రియుడు రాకేశ్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు కుట్రపన్నారు. ఈ కుట్రలో భాగంగా మీనా ఊరికి వెళ్దామని తన కుమారుడికి చెప్పింది.
కుమారుడు అంగీకరించడంతో రాకేశ్ కారులోనే తల్లి మీనా, కొడుకు విజయ్ బయలుదేరారు. మార్గమధ్యలో మీనా శీతల పానీయంలో నిద్రమాత్రలు కలిపి విజయ్‌కి ఇచ్చింది. విజయ్ మత్తులోకి జారుకున్న తర్వాత శాలువాతో అతని గొంతుకు ఉరి బిగించి చంపేశారు. బెళగావి వరకు వెళ్లాక మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసిపోయారు. హత్యకు రాకేశ్ స్నేహితులు కూడా సహకరించారని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఆ మేరకు మృతుడి తల్లి మీనా నారాయణ, ఆమె ప్రియుడు రాకేశ్ జామూని, అతని స్నేహితులు సచిన్ కాంబ్లె, మనోజ్ కాంబ్లె, తమ్మణ్ణ కాంబ్లె, ఏకనాథ కాంబ్లెలను అరెస్టు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

