Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Man Rapes Woman | ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న మహిళకు అది మంజూరైనట్లు ఒక వ్యక్తి నమ్మించాడు. పత్రాలపై సంతకాల పేరుతో గెస్ట్ హౌస్‌కు ఆమెను రప్పించాడు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేసి ఆమెను బెదిరించాడు.
లక్నో: ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న మహిళకు అది మంజూరైనట్లు ఒక వ్యక్తి నమ్మించాడు. పత్రాలపై సంతకాల పేరుతో గెస్ట్ హౌస్‌కు ఆమెను రప్పించాడు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేసి ఆమెను బెదిరించాడు. (Man Rapes Woman) బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బృందావన్ కొత్వాలి ప్రాంతంలో నివసించే ఒక మహిళ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నది. అనిల్ కుమార్‌గా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేశాడు. ఆమె దరఖాస్తు ఆమోదం పొందినట్లు తెలిపాడు. అక్టోబర్ 30న ఒక ఖాళీ స్థలాన్ని ఆ మహిళకు చూపించాడు. పీఎంఏవై కింద అక్కడ నిర్మించే ఇల్లు ఆమెకు ఉచితంగా లభిస్తుందని నమ్మించాడు.
కాగా, నవంబర్ 5న అధికారిక పత్రాలపై సంతకాలు చేయడానికి, ఇతర లాంఛనాలు పూర్తి చేయడానికి అని చెప్పి బృందావన్‌లోని ఒక గెస్ట్ హౌస్‌కు ఆ మహిళను అనిల్ కుమార్ పిలిచాడు. మత్తుపదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఆమెకు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోను వైరల్ చేస్తానని అతడు బెదిరించాడు.
అయితే బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
KTR | కేసీఆర్ ఇదే నిర్మల్ గడ్డ మీద తెలంగాణను తీసుకొస్తా అన్నరు : కేటీఆర్
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

