‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మామిళ్లగూడ వద్ద ఒక్కో ఫ్లాట్ రూ.8.50 లక్షలతో (G+5) బ్లాక్‌లలో 480 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెం.579 ద్వారా అనుమతించిందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
– గ్రౌండ్ +5 బ్లాక్ లలో 480 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
– ఇంటికి రూ.8.5 లక్షల ఖర్చు
– ప్రభుత్వ వాటా రూ.5.0 లక్షలు, లబ్ధిదారుల వాటా రూ.3.5 లక్షలు
– నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన వారు మీ సేవా ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడి
నల్లగొండ, నవంబర్ 11 : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మామిళ్లగూడ వద్ద ఒక్కో ఫ్లాట్ రూ.8.50 లక్షలతో (G+5) బ్లాక్‌లలో 480 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెం.579 ద్వారా అనుమతించిందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5.00 లక్షల సబ్సిడీ ఇస్తుందని, లబ్ధిదారుల వాటా కింద యూనిట్‌కు రూ.3.50 లక్షలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన వారు మీ సేవా ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు, ప్లాట్ లేని వారై ఉండాలని, వార్షిక ఆదాయం రూ.6.0 లక్షలు దాటకూడదని, ఒక్క కుటుంబం నుండి ఒక్కరూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..!
‘నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం’
Man Rapes Woman | ఇల్లు మంజూరైనట్లు నమ్మించి.. మహిళపై వ్యక్తి అత్యాచారం, వీడియో రికార్డ్
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

